ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంగళవారం రాత్రి కురిసిన వడగండ్ల వర్షంతో రైతులు తీవ్ర నష్టపోయారు. మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలంలో 39 గ్రామాలలో రైతులు వేసిన పంటలు మిర్చి మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. రైతు వేదిక రేకులు ఊడిపోయాయి. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ రిపేర్ కేంద్రం రేకులు గాలివానకు లేచిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది.
మరోవైపు మిర్చి పంటకు వైరస్ సోకి లక్షలు పెట్టుబడి పోయి నష్టపోయామని రైతులు లబోదిబో మంటున్నారు. ఈ సమయంలో కురిసిన అకాల వర్షంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital