Tuesday, November 26, 2024

Warangal: వరి కల్లాల్లో తడిసిన ధాన్యం

వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వీస్తున్నాయి. బుధవారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. దీంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. వర్షం కారణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసి ముద్దయ్యాయి. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఆందోళన చెందుతున్నారు. ఇక అసలే అంతంత మాత్రంగానే కాసిన మామిడి నేల రాలిపోవడంతో మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతకొద్ది రోజులుగా ఎండ వేడిమితో అల్లాడుతున్న ప్రజలకు ఒక్కసారిగా వర్ష ప్రభావం వల్ల ఉపశమనం లభించినట్లైంది. నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement