Tuesday, November 26, 2024

Assam: భారీ వ‌ర్షాలు.. వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న 31వేల మంది

గత కొన్ని రోజులుగా అస్సాంలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని 10 జిల్లాల్లో ప‌రిస్థితి దారుణంగా ఉంది. ఆ జిల్లాల్లో సుమారు 31 వేల మంది వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఐఎండీ ఇప్ప‌టికే రెడ్ అల‌ర్ట్ వార్నింగ్ ఇచ్చింది. రానున్న అయిదు రోజుల్లో మ‌రికొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ పేర్కొన్న‌ది.

ల‌ఖింపూర్ జిల్లాలో సుమారు 22 వేల మంది వ‌ర‌ద నీటిలోనే ఉన్నారు. దిబ్రుఘ‌ర్‌, కోక్రాజార్ జిల్లాల్లోనూ వేలాది మంది వ‌రద నీటి ప్ర‌భావానికి గుర‌య్యారు. ఏడుజిల్లాల్లో 25 రిలీఫ్ డిస్ట్రిబూష‌న్ సెంట‌ర్ల‌ను ప్ర‌భుత్వం న‌డిపిస్తోంది. కొన్ని ప్ర‌దేశాల్లో కొండ చ‌రియ‌లు విరిగిప‌డుతున్నాయి. దిమా హ‌సావో, కామ‌రూప్ మెట్రోపాలిటిన్‌, క‌రీంగంజ్ ప్ర‌దేశాల్లో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. సోనిత్‌పూర్‌, న‌గావ్‌, నాల్బ‌రి, బాక్సా, చిరాంగ్‌, ద‌ర్రాంగ్‌, దేమాజి, గోల్‌పారా, గోలాఘాట్‌, కామ‌రూప్‌, కోక్రాజార్‌, ల‌ఖింపూర్‌, దిబ్రూగ‌ర్‌, క‌రీంగంజ్‌, ఉద‌ల్‌గిరి ప‌ట్ట‌ణాల్లో రోడ్లు, బ్రిడ్జ్‌లు కొట్టుకుపోయాయి. వరదల కారణంగా ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement