Thursday, November 21, 2024

రెండు రోజులు జాగ్రత్త.. వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక

తెలంగాణవ్యాప్తంగా జోరు వర్షాలు పడుతున్నాయి. అల్పపీడణ ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు… అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గత రెండు రోజులు రాజధాని హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మంచిర్యాల జిల్లా 20 సెం.మీటర్ల అత్యంత భారీ వర్షం కురిసింది. నిర్మల్ జిల్లా 15.3, కామారెడ్డి జిల్లా జుక్కల్ లో 12.8, జగిత్యాల జిల్లాలో 12.3 సెం.మీటర్ల వర్షం పడింది. హైదరాబాద్ తోపాటు కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

మరోవైపు భారీ వర్షాలలతో రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు తోడు జిల్లాలో పడుతున్న వానలతో శ్రీరామ్ సాగర్ కు ఇన్ ఫ్లో పెరుగుతోంది. రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు పడే అవకాశం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ కు పూర్వ వైభవం.. హస్తం గూటికి మాజీలు!

Advertisement

తాజా వార్తలు

Advertisement