తెలంగాణలో వాతావరణం మారింది. ఇవ్వాల మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొడితే.. సాయంకాలానికి భారీ వర్షం అతలాకుతలం చేస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సాయంత్రం ఈదురుగాలులతో మొదలైన భారీ వర్షం దాదాపు గంటకు పైగానే కొనసాగింది. దీంతో పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. గాలి వేటుకు పెద్ద పెద్ద వృక్షాలు నేలకొరిగాయి. ఇండ్లపై ఉన్న రేకులు కొట్టుకుపోయాయి. పెనుగాలులు బీభత్సంతో కొత్తగూడెం జిల్లా అంతటా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు ఒరిగిపోవడంతో విద్యుత్‌కు అంతరాయం కలిగింది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.. పంట నష్టం అంచనాపై అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు లీడర్లు కోరుతున్నారు.
Breaking: కొత్తగూడెం జిల్లాలో ఈదురుగాలులతో భారీ వర్షం.. నేలకొరిగిన వృక్షాలు, విద్యుత్ స్తంభాలు..
Advertisement
తాజా వార్తలు
Advertisement