Saturday, November 23, 2024

Weather: హైదరాబాద్ లో ఉరుములు, మెరుపులు.. నేడు, రేపు భారీ వర్షాలు

హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. ఈ రోజు తెల్లవారుజామున నుంచే ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, సికింద్రాబాద్, అల్వాల్, సైదాపేట, చంపాపేట, సరూర్‌నగర్, కొత్తపేట, దిల్‌సుఖ్‌నగర్, వనస్థలిపురం సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరుకుంది.

సికింద్రాబాద్ లోని సీతాఫల్మండి లో 7.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. బంసిలాల్ పేట్ లో 6.7 సెంటీమీటర్లు, వెస్ట్ మారేడ్ పల్లిలో లో 6.1, అల్వాల్లో 5.9, ఎల్బీ నగర్ లో 5.8, గోషామహల్, బాలానగర్ లో 5.4, ఏఎస్ రావు నగర్ లో 5.1, బేగంపేటలోని పాటిగడ్డ లో 4.9, మల్కాజ్గిరిలో 4.7, సరూర్ నగర్, ఫలక్ నామా లో 4.6, గన్ ఫౌండ్రీ లో 4.4, కాచిగూడ , సికింద్రాబాద్ లో 4.3 సెంటీమీటర్లు, చార్మినార్ లో 4.2, గుడిమల్కాపూర్, నాచారంలో 4.1, అంబర్ పేట్ లో 4, అమీర్ పేట్, సంతోష్ నగర్ లో 3.7, ఖైరతాబాద్లో 3.6, బేగంబజార్ ,హయత్ నగర్, చిలకనగర్ లో 3.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.

నగరంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయాయి. హైదరాబాద్ తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ భారీగా వర్షం కురుస్తోంది. ఉపరితల ద్రోణి ప్రభావంతోనే వర్షాలు పడుతున్నాయని వాతావారణ శాఖ తెలిపింది. నేడు, రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, గత కొన్ని రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న ప్రజలకు ఈ వర్షం ఊరటనిచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement