బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరాన్ని మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. చెన్నైకి 170 కి.మీ దూరంలో వాయుగుండం ఉంది. ఈ రోజు సాయంత్రానికి తీరం దాటనుందని వాతావరణ శాఖ అంచన వేస్తోంది. చెన్నై నగరంలో కుండపోత వర్షానికి 8 సబ్ వేలు మునిగిపోయాయి. నగరంలో సహాయక చర్యల నిమిత్తం మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. రాష్ట్రలోని పలు జిల్లాల్లోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై నగరంలోనూ, 12 జిల్లాల్లోనూ రెడ్ అలర్ట్ ప్రకటించారు. చెన్నైతో పాటు కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు, విల్లుపురం, తేన్ కాశీ, కన్యాకుమారి, మధురై, శివగంగై, పుదుకోట్టై, తిరునల్వేలి, తిరువారూరు, రామనాథపురం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆయా 12 జిల్లాల్లో ఇవాళ, రేపు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అత్యధికంగా తాంబరంలో 23 సెం.మీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచుకోవాలని, ప్రజలు ఎవరూ బయటికి రావొద్దని ప్రభుత్వం సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇతర ప్రాంతాలకు తరలించాలని ఆదేశించింది. వరద ప్రాంతాల్లో విద్యుత్ సరఫరానిలిపివేయాలని తెలిపింది.
ఇది కూడా చదవండి: ఆన్ లైన్ లో సినిమా టికెట్లు: ఎగ్జిబిటర్ల సమ్మతమే!
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily