హైదరాబాద్ లో ఇవ్వాల సాయంత్రం భారీ వర్షం కురిసింది.. కుండపోత వానతో పలు కాలనీలు జలమయం అయ్యాయి. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షం నేపథ్యంలో హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, మియాపూర్, రాయదుర్గం, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, సుచిత్ర, కొంపల్లి, గాజులరామారం, సురారం, కూకట్‌పల్లి, బాలానగర్, చింతల్, నార్సింగి, కొంపల్లి, కోకాపేట్, అల్వాల్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, పటాన్‌చెరు, నిజాంపేట, లింగంపల్లి, నేరెడ్‌మెట్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది.
వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలో సహాయ కార్యక్రమాల కోసం 9000113667 నెంబర్ లో సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే వాహనదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు.