హైదరబాద్‌లో ఇవ్వాల (శనివారం) రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురుస్తుండగా.. మరికొన్ని చోట్ల భారీగా పడుతున్నట్టు సమాచారం అందుతోంది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడుతున్నాయి.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పెద్ద అంబర్పేట్ హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్ మన్సూరాబాద్, దిల్సుఖ్నగర్, చైతన్యపురి, కొత్తపేట వంటి పలు ఏరియాల్లో మోస్తరు జల్లులు పడుతున్నాయి. దీంతో వాహనదారులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇప్పటికే వర్షానికి సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులు మెస్సేజ్ ద్వారా అలర్ట్ చేశారు.
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రేపు, ఎల్లుండి మోస్తరు జల్లులుంటాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక.. నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాయలసీమ, ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.