హైదరబాద్‌లో ఇవ్వాల (ఆదివారం) సాయంత్రం నుంచి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురుస్తుండగా.. మరికొన్ని చోట్ల భారీ వర్షం పడుతోంది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తున్నాయి. సాయంత్రం 5 గంటల దాకా హాట్ హాట్‌గా ఉన్న వెదర్ ఆ తర్వాత మారిపోయింది. ఆకాశంలో నల్లని కారుమేఘాలు కమ్ముకున్నాయి.
అంతేకాకుండా.. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రేపు, ఎల్లుండి వర్షాలుంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. ఇక.. ఇవ్వాల జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పెద్ద అంబర్పేట్, హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, మన్సూరాబాద్, దిల్సుఖ్నగర్, చైతన్యపురి, కొత్తపేట, టోలీచౌకి, గచ్చిబౌలి, అప్పా జంక్షన్‌తోపాటు అవుట్ రింగ్ రోడ్ వంటి పలు ఏరియాల్లో వర్షం కురుస్తోంది. దీంతో వాహనదారులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. గచ్చిబౌలి, హైటెక్‌సిటీ వంటి పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది.