హైదరబాద్‌లో ఇవ్వాల (బుధవారం) సాయంత్రం 5.30 గంటల నుంచి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురుస్తుండగా.. మరికొన్ని చోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తున్నట్టు తెలుస్తోంది. సాయంత్రం 5 గంటల దాకా కూల్ కూల్‌గా ఉన్న వెదర్ 5.30 తర్వాత మారిపోయింది. ఆకాశంలో నల్లని కారుమేఘాలు కమ్ముకున్నాయి.
ఇక.. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రేపు, ఎల్లుండి కూడా భారీ వర్షాలుంటాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పెద్ద అంబర్పేట్ హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్ మన్సూరాబాద్, దిల్సుఖ్నగర్, చైతన్యపురి, కొత్తపేట వంటి పలు ఏరియాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. దీంతో వాహనదారులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. అయితే.. చల్లబడ్డ వాతావరణంతో సిటీ జనం కాస్త ఊరటపొందుతున్నారు. కూల్ వెదర్ని ఎంజాయ్ చేస్తూ సేద తీరుతున్నారు.