హైదరబాద్‌లో ఇవ్వాల (శుక్రవారం) సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు జల్లులు పడుతుండగా.. మరికొన్ని చోట్ల కుండపోత వాన కురుస్తున్నట్టు తెలుస్తోంది. సాయంత్రం 6 గంటల దాకా చిటపట చినుకులతో కూల్ కూల్‌గా ఉన్న వెదర్ రాత్రి 7 గంటల తర్వాత మారిపోయింది. ఆకాశం మేఘావృతమై పలు ప్రాంతాల్లో జల్లులు కురిశాయి.
ఇక.. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రేపు భారీ వర్షాలుంటాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు సాయంత్రం నుంచే హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు జల్లులు కురుస్తున్నాయి. జూబ్లీహిల్స్‌లో ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో వాహనదారులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. చల్లబడ్డ వాతావరణంతో సిటీ జనం కాస్త ఊరటపొందుతున్నారు. కూల్ వెదర్ని ఎంజాయ్ చేస్తూ సేద తీరుతున్నారు.