హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది.ఈరోజు ఉదయం ఎండకొట్టినప్పటికీ.. క్రమంగా మబ్బులు కమ్ముకోవడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట, బోరబండ, కూకట్‌పల్లి, ఎర్రమంజిల్, ఖైరతాబాద్, బషీర్‌బాగ్, అమీర్‌పేట, తర్నాక, చింతల్‌బస్తి, సోమాజిగూడ, నాంపల్లి, లక్డీకపూల్, కోఠిలో కుండపోతగా వర్షం కురుస్తోంది. అలాగే నారాయణగూడ, హిమాయత్‌నగర్, మాదాపూర్, లింగంపల్లి, ఉప్పల్, ఓయూ క్యాంపస్, నాచారం, మల్లాపూర్, కాప్రా, ఈసీఐఎల్, సికింద్రాబాద్, బేగంపేట, ట్యాంక్‌బండ్ పరిసరాల్లో భారీ వర్షం పడుతున్నది. చాదర్‌ఘాట్, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్‌లో వర్షం కురుస్తున్నది.
ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పంజాగుట్ట శ్మశానవాటిక వద్ద భారీగా వాన నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులెదుర్కొన్నారు.