Tuesday, November 26, 2024

ఢిల్లీలో భారీ వ‌ర్షం.. ఆల‌స్యంగా విమానాల రాక‌పోక‌లు

భారీ వ‌ర్షంతో ఢిల్లీ విమానాశ్ర‌యంలో విమానాల రాక‌పోక‌లు ఆల‌స్యం కానున్నాయి. ఢిల్లీ.. ఎన్సీఆర్ ప్రాంతంలో భారీ వ‌ర్షం కురిసింది. ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురవడంతో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. గత కొద్దిరోజులుగా వేడి గాలులతో సతమతవుతున్న ఢిల్లీ ప్రజలకు భారీ ఉపశమనం కలిగింది. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్‌తో సహా సమీప ప్రాంతాలకు నేడు ఉరుములతో కూడిన తుఫాను సూచన జారీ చేయబడింది. మంగళవారం వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందుగా అంచనా వేసింది. అయితే తాజాగా శనివారం భారీ వర్షం కురిసిన నేపథ్యంలో.. ఢిల్లీతో పాటు సమీప ప్రాంతాల్లో వచ్చే రెండు గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు తీవ్రతతో కూడిన వర్షం.. 40-70 కి.మీ వేగంతో ఈదురు గాలులతో కూడిన ఉరుములు..ధూళి తుఫాను కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మే 30 వరకు కూడా ఢిల్లీలో ఎండ తీవ్రత అంతగా ఉందని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement