ఉత్తరాఖండ్ లో భారీ వర్షాల కారణంగా అమర్ నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్ పడింది. రాంబన్ జిల్లాలో జమ్ము కశ్మీర్ జాతీయ రహదారిపై కొండ చరియలు విరిగిపడుతున్నాయి. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ క్రమంలో అమర్ నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. కాగా, ఇవ్వాల (శుక్రవారం) అమర్నాథ్లో కుంభవృష్టి కురుస్తోంది. భారీ వర్షాల కారణంగా ఇద్దరు చనిపోగా, ఐదుగురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని ఎయిర్ లిఫ్ట్ చేసి రెస్క్యూ చేస్తున్నారు.
అయితే.. అమర్నాథ్ గుహ పరిసరాల్లో దాదాపు 12వేల మంది యాత్రికులున్నట్టు అంచానా వేస్తున్నారు. జూన్ 30న అమర్నాథ్ యాత్ర ప్రారంభం కాగా పలు అవాంతరాల నడుమ భక్తులు తరలివస్తున్నారు. ఇవ్వాల అకస్మాత్తుగా వచ్చిన వరదలతో యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు. వరదల్లో టెంట్లు, వస్తు సామగ్రి మొత్తం కొట్టుకుపోయాయి. లోయలో రెండు కిలోమీలర్ల మేర వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ఐటీబీపీ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.