రాగల రెండు గంటల్లో హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే చాన్స్ ఉందని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని అధికారులు సూచించారు. భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో విపత్తు నిర్వహణ బృందాలను అప్రమత్తం చేశారు. రాత్రి 8 గంటల నుంచి జంట నగరాల పరిధిలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
సరూర్‌నగర్, చంపాపేట, సైదాబాద్, సంతోష్‌నగర్, మలక్‌పేట, చాదర్ఘట్, ఐఎస్ సదన్, గచ్చిబౌలి, మియాపూర్, మాదాపూర్, కొండాపూర్, బంజారాహిల్స్, కాళీమందిర్, సన్‌సిటీ తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. ఇక.. ఇవ్వాల ఉదయం నుంచి సూరీడు తన ప్రతాపం చూపడంతో సిటీ జనం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. కాగా, సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షం కురవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.