Monday, November 18, 2024

హైదరాబాదులో మారిన వాతావరణం.. ఈదురుగాలులతో భారీ వర్షం

హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణ మారిపోయింది. ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది.  మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌, షేక్‌పేట, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్‌సిటీ, నిజాంపేట్, కూకట్‌పల్లి, మణికొండ, ఫిలింనగర్, ఎస్సార్‌‌నగర్‌, పంజాగుట్ట, చాదర్ ఘాట్, మలక్ పేట్, రాజేంద్రనగర్ తో పాటు పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. భారీ వర్షానికి ప్రధాన రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలు వరద కాలువలుగా మారిపోయాయి. ఈదురుగాలుల ధాటికి పలు ప్రాంతాల్లో చెట్లు, స్తంభాలు విరిగిపడ్డాయి.  పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వర్షం ధాటికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

కాగా, గత కొద్ది రోజులుగా తీవ్రమైన ఎండలతో సతమతమవుతున్న హైదరాబాద్ నగర ప్రజలు ఈ వర్షాలతో కొంత చల్లబడ్డారు. అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్‌తో సహా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. ఒకటి రెండుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement