గోదావరి, కృష్ణా నదులకు పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు 16 క్రస్ట్ గేట్లు 10 అడుగల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌కు ఇన్‌ఫ్లో 3.14లక్షల క్యూసెక్కులు వస్తోంది. అవుట్ ఫ్లో 2.82 లక్షల క్యూసెక్కులుగా ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 588.70 అడుగులు ఉంది.
సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలకు గాను, ప్రస్తుత నీటి నిల్వ 308.1702 టీఎంసీలకు చేరింది. గోదావరిలోనూ వరదప్రవాహం కొనసాగుతోంది. దీంతో భద్రచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 51.5 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. ఇన్‌ఫ్లో 13.43లక్షల క్యూసెక్కులు, ధవళేశ్వరం దగ్గర కూడా వరద పోటెత్తుతోంది.