ములుగు, (ప్రభ న్యూస్) : గోదావరి నదికి భారీగా వరద వస్తోంది. దీంతో ములుగు జిల్లా ఏటూరునాగారం, రామన్నగూడెంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. పుష్కరఘాట్ వద్ద వరుద ఉధృతి పెరగడంతో అధికారులు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఏటూరు నాగారానికి ఎగువ భాగమైన మహారాష్ట్ర, కాళేశ్వరం, లక్ష్మి బ్యారేజ్ , ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుండి వరుద నీరు ఉధృతంగా ప్రవహించి గోదావరి నదిలో కలుస్తోంది.
దీంతో ఏటూరు నాగారం సమీపంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ కు వరుద పెరిగింది. ఐటీడీఏ పీఓ అంకిత్ ఇవ్వాల సాయంత్రం పుష్కరఘాట్ ను పరిశీలించారు. వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఐటీడీఏలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఏవో దామోదర స్వామిని ఆదేశించారు. అనంతరం కమలాపురం, ఏటూరునాగారం మధ్య జాతీయ రహదారిపై ఉదృతంగా ప్రవహిస్తున్న జీడువాగును పరిశీలించారు.