Saturday, November 23, 2024

భారీ విమాన వాహ‌న నౌక ఐఎన్ ఎస్ విక్ర‌మాదిత్య‌లో అగ్ని ప్ర‌మాదం-మంట‌లార్పిన సిబ్బంది

పెను ప్ర‌మాదం త‌ప్పింది..ఇండియ‌న్ నేవీకి చెందిన భారీ విమాన వాహ‌క నౌక ఐఎన్ ఎస్ విక్ర‌మాదిత్య‌. ఈ యుద్ధ‌నౌక‌లో అగ్నిప్ర‌మాదం జ‌రిగింది.. వెంటనే ప్రతిస్పందించిన క్రూ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని నేవీ అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి విచారణకు ఆదేశించినట్టు చెప్పారు. ఈ విమాన వాహక నౌకను రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసింది. దీని విలువ 2.3 బిలియన్ డాలర్లు. 2014లో ఇది రష్యా నుంచి ఇండియాకు చేరుకుంది. దీని బరువు దాదాపు 40 వేల టన్నులు ఉంటుంది. ప్రస్తుతం కర్ణాటక తీరంలోని కార్వార్ లో ఈ నౌక ఉంది. ఈ విమాన వాహక నౌకపై మిగ్ 29కే ఫైటర్ జెట్లు, కమోవ్ హెలికాప్టర్లు ఉన్నాయి. ఐఎన్ఎస్ విక్రమాదిత్య 284 మీటర్ల పొడవు, 60 మీటర్ల ఎత్తుతో ఉంటుంది. 20 అంతస్తుల భవనం అంత ఎత్తును కలిగి ఉంటుంది. ఇండియన్ నేవీలో ఇదే అతి పెద్ద షిప్ .

Advertisement

తాజా వార్తలు

Advertisement