Tuesday, November 26, 2024

ఢిల్లీలో భారీగా పేరుకుపోయిన వ్య‌ర్థాలు-ఇప్ప‌ట్లో తొల‌గించ‌డం క‌ష్ట‌మే

ఢిల్లీలో భారీగా పేరుకుపోయాయి వ్య‌ర్థాలు.వీటిని తొల‌గించాలంటే సుమారు 197ఏళ్ల స‌మ‌యం ప‌ట్ట‌నుంద‌ని అధికారులు తెలిపారు. ఢిల్లీ చుట్టుపక్కల మూడు ప్రాంతాల్లో వ్యర్థాలు భారీగా పేరుకుపోయాయి. 27.6 మిలియన్ టన్నుల వ్యర్థాలు అక్కడ ఉన్నాయి. ఈ వ్యర్థాలను తరలించేందుకు రూ.250 కోట్లతో మూడేళ్ల క్రితం ప్రాజెక్టు చేపట్టగా.. ఈ కాలంలో 28 మిలియన్ టన్నుల నుంచి 27.6 మిలియన్ టన్నులకే వ్యర్థాలు తగ్గాయి. అంటే కేవలం 0.4 మిలియన్ టన్నుల వ్యర్థాల తగ్గింపునకు మూడేళ్లు పడితే.. మొత్తం పోవడానికి సుదీర్ఘకాలం పట్టేట్టు ఉంది. గడిచిన మూడేళ్లలో రోజూ సగటున 5,315 టన్నుల వ్యర్థాలను శుభ్రం చేయడం, తొలగించడం చేశారు. అదే సమయంలో ఢిల్లీలో రోజూ కొత్తగా 4,931 టన్నుల వ్యర్థాలు వచ్చి చేరుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement