తెలంగాణలో సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. రాష్ట్రంలో ఇప్పటికే 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. దీంతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో నాలుగు రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని తెలిపింది. ప్రజలు అప్రమ్తతంగా ఉండాలని హెచ్చరించింది. చాలా జిల్లాల్లో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ, తదితర జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి.
మరోవైపు రాష్ట్రంలో వడగాడ్పులు, తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉక్కపోతగా ఇండ్లలో ఉండలేని పరిస్థితి. పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఇదే పరిస్థితి ఇంకొన్నిరోజులు కొనసాగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది.