తెలంగాణలో మళ్లీ ఎండలు దంచికొడుతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. భానుడి భగభగలకు జనాలు విలవిలలాడిపోతున్నారు. ఎండ తీవ్రతకు చెమట్లు కక్కుతున్నారు. రానున్న రెండురోజుల్లో రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణ ఉష్ణోగ్రతల కన్నా 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. రాగల రెండురోజులు పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. దక్షిణ ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీంతో ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement