Tuesday, November 26, 2024

దేశవ్యాప్తంగా మండిపోతున్న ఎండలు.. వడగాలుల‌తో అల్లాడిపోతున్న ప్ర‌జ‌లు

దేశ వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. దేశంలో చాలా రాష్ట్రాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరిగిపోయాయి. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. వ‌డ‌గాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తెలంగాణ‌లో వ‌డ‌దెబ్బ‌ వ‌ల్ల‌ నిన్న ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో 45.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అవుతున్నాయి. అయితే రానున్న రోజుల్లో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంటున్నారు.  ఎండల పట్ల ప్రజలు జాగ్రతగా ఉండాలిన వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. సాధారణంగా మే నెలలో ఎండలు అధికంగా ఉంటాయి. జమ్ము కశ్మీర్, పంజాబ్,హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement