Wednesday, November 20, 2024

మార్చిలోనే మండుతున్న ఎండలు..

మార్చి‌లోనే ఎండలు దంచి కొడు‌తు‌న్నాయి. రాష్ట్రం‌లో నిన్న ఈ ఏడాది అత్యదిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 20 ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 39.6 నుంచి 40.7 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. జగి‌త్యాల 40, వన‌పర్తి 39.5, మంచి‌ర్యాల 39, మహ‌బూ‌బ్‌‌న‌గర్‌, నారా‌య‌ణ‌పే‌టలో 38.9 డిగ్రీల ఉష్ణో‌గ్రత రికార్డయింది. జీహె‌చ్‌‌ఎంసీ పరి‌ధిలో 37.8 డిగ్రీల ఉష్ణో‌గ్రత నమోదైంది. వికా‌రా‌బాద్‌ జిల్లా బషీ‌రా‌బా‌ద్‌లో చిరు జల్లులు కురి‌శాయి. బుధ‌వారం ఆగ్నేయ మధ్యప్రదేశ్‌, దాని పరి‌సర ప్రాంతాల్లో ఏర్పడిన ఉప‌రి‌తల ద్రోణి బల‌హీ‌ప‌డింది. రాయ‌ల‌సీమ నుంచి కోస్తా ఆంధ్రా తీరం మీదుగా దక్షిణ ఒడిశా వరకు 0.9 కిలో‌మీ‌టర్ల వద్ద గాలి విచ్ఛి‌న్నతి ఏర్పడిందని, దీంతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో పొడి వాతా‌వ‌రణం ఏర్పడే అవ‌కాశం ఉందని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం తెలి‌పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement