Tuesday, November 26, 2024

Heat Waves: తెలంగాణలో భానుడి సెగలు.. 40 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు..

తెలంగాణలో ఎండలు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్‌, రామగుండం, నిజామాబాద్‌, పెద్దపల్లి, నల్గొండ, భద్రాచలం, మెదక్‌ తదితర ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. ఉత్తర, ఈశాన్య భారత నుంచి తెలంగాణలోకి వీస్తున్న వేడి గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తీవ్ర ఎండల కారణంగా మరో రెండు రోజుల పాటు వడగాలుల ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు దగ్గరగా నమోదు కావడంతో పగలు సమయంలో జనం రోడ్లపైకి రావడానికి జంకుతున్నారు. దీంతో మధ్యాహ్నం సమయంలో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. మార్చి నెలలోనే రికార్డు స్థాయిలో ఎండలు నమోదు కావడం ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే.. రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement