Wednesday, November 20, 2024

రేపు, ఎల్లుండి జాగ్రత్త..!!

రెండు రోజుల పాటు తేలిక పాటి వర్షాలు కురవడంతో చల్లబడిన వాతావరణం.. ఇప్పుడు మళ్లీ ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ర్టంలో రాగ‌ల మూడు రోజుల్లో పొడి వాతావ‌ర‌ణం ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు. రేపు, ఎల్లుండి గ‌రిష్ఠ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యే అవ‌కాశం ఉంద‌న్నారు. సాధార‌ణం క‌న్నా2 – 3 డిగ్రీలు అధికంగా న‌మోదయ్యే అవ‌కాశం ఉంది. ఇక ద‌క్షిణ ఒడిశా ప‌రిస‌ర ప్రాంతాల్లో ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం బ‌ల‌హీన ప‌డింది. విద‌ర్భ నుంచి త‌మిళ‌నాడు వ‌ర‌కు ఉప‌రిత‌ల ద్రోణి ఏర్ప‌డింది. మ‌ర‌ట్వాడా, క‌ర్ణాట‌క మీదుగా త‌మిళ‌నాడు వ‌ర‌కు ద్రోణి కొన‌సాగుతోంది. స‌ముద్ర మ‌ట్టానికి 0.9 కిలోమీట‌ర్ల ఎత్తున ఉప‌రిత‌ల ద్రోణి ఏర్ప‌డింది. దీంతో ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement