తెలంగాణలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. వడదెబ్బతో సోమవారం అయిదుగురు మృతి చెందారు. ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు అదనంగా పెరగడంతో అధిక వేడి, ఉక్కపోతలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. సోమవారం అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలోని భోరజ్ లో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం నుంచి నాలుగు రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ కేంద్రం ఆరెంజ్ రంగు హెచ్చరిక జారీచేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement