Saturday, November 23, 2024

విజయ్ మాల్యా ధిక్కార కేసు – మార్చి 10కి వాయిదా

న్యూఢిల్లీ : కోర్టు ధిక్కార కేసులో వాస్తవాలను దాచిపెట్టి పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాపై ధిక్కార కేసును సుప్రీంకోర్టు ఈ విచార‌ణ‌ని వాయిదా వేసింది. రూ.9వేల కోట్ల రుణ ఎగవేతలకు సంబంధించిన కేసులో కోర్టు ముందు హాజరుకావాలన్న కోర్టు ఆదేశాలను ధిక్కరించిన కేసును ఇవాళ విచారించాల్సి ఉంది. అయితే, తనకు వేరే కేసు ఉందని, విచారణను వాయిదా వేయాలంటూ సుప్రీంకోర్టును సీనియర్ అడ్వొకేట్, అమికస్ క్యూరీ జైదీప్ గుప్తా విజ్ఞప్తి చేశారు. దీంతో కేసు విచారణను రేపు మధ్యాహ్నం 2 గంటలకు జస్టిస్ యు.యు. లలిత్, జస్టిస్ ఎస్. రవీంద్ర భట్, జస్టిస్ పి.ఎస్. నరసింహలతో కూడిన ధర్మాసనం వాయిదా వేసింది. మాల్యాపై కోర్టు ధిక్కరణ కేసును మార్చి 9న విచారిస్తామని ఫిబ్రవరి 10న జరిగిన విచారణలో సుప్రీంకోర్టు పేర్కొంది.

మాల్యా వ్యక్తిగతంగాగానీ లేదా ఆయన లాయర్ గానీ కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. ఇప్పటికే ఎన్నో అవకాశాలిచ్చామని, అయినా స్పందన లేదని అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుతం బ్రిటన్ లో ఉన్న మాల్యాను 2017 కేసుకు సంబంధించి ధిక్కరణకు పాల్పడినట్టు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పిన ఆదేశాలను పట్టించుకోలేదని, ఎంతో కాలం వేచి చూశామని మండిపడింది. అమికస్ క్యూరీ సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా పిటిషన్‌పై న్యాయమూర్తులు యుయు లలిత్, రవీంద్ర ఎస్ భట్, పిఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం విచారణ వాయిదా పడింది. కోర్టు తీర్పును ధిక్కరిస్తూ మాల్యా తన పిల్లలకు USD 40 మిలియన్లు బదిలీ చేసిన తర్వాత కోర్టు ధిక్కారానికి పాల్పడ్డాడు మరియు అత్యున్నత న్యాయస్థానం అతనికి అనేకసార్లు సమన్లు ​​జారీ చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement