Friday, November 22, 2024

ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు

తొర్రూరు (ప్రభ న్యూస్): రాష్ట్రం ఆరోగ్య తెలంగాణగా మారాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యం అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆజాదీ కా అమృతోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య మేళా నిర్వహించారు. ఈ మేళా ను మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించి కంటి పరీక్షలు చేయించుకున్నారు. మధుమేహం, రక్తపోటు, కంటి, చెవి, ముక్కు, గొంతు, ఇతర పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ శశాంకతో కలిసి మంత్రి మాట్లాడారు. అనేక రకాల వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ఆరోగ్య మేళా దోహద పడిందని తెలిపారు. వైద్యుల కృషి, ప్రజల సహకారంతో కొవిడ్ మహమ్మారి నుండి రాష్ట్రం బయట పడిందన్నారు. భయం వీడి సాధారణ జనజీవనం మొద‌లైందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement