అందం అటే మగువలు.. మగువలంటే అందానికి నిర్వచనం. ఎందుకంటే ఓ మోస్తరుగా ఉన్నవారికి కూడా సరైన మేకప్ వేస్తే వారి లుక్కే మారిపోతుంది. బొట్టు దగ్గర నుంచి ముఖంలో వీలైనంతవరకు ఎంతో మేకప్ చేయొచ్చు, కళ్లకి కాజల్, ఐలైనర్, ఐషాడో, లిప్ స్టిక్ ఇలా ఎంతో మేకప్ చేసుకుంటుంటారు. ప్రత్యేకంగా మహిళలకోసం ఎన్నో రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు వారు మేకప్ కి ఇచ్చే ప్రాధాన్యత ఏంటో. పలు రకాల దుస్తుల దగ్గర నుంచి, కాళ్ళకి వేసుకునే హీల్స్ వరకు ..తలకు పెట్టుకునే క్లిప్ వరకూ అన్నీ ట్రెండింగ్ గా..అందంగా ఉండాలనుకుంటారు. కొందరికి గోళ్లు ఎంతపెంచినా పెరగవు..కనుబొమ్మలు అసలు పలుచుగా ఉంటాయి. ఒకప్పుడు ఇవి వారికి సమస్య కానీ..ఇప్పుడు వీటన్నింటికి ప్రత్యామ్మాయాలు వచ్చేశాయి. ఆర్టిఫీషియల్ నెయిల్స్ పెట్టుకుంటున్నారు. అచ్చం రియల్ నెయిల్స్ లానే ఉంటాయి. ఐబ్రోస్ కి పెన్సిల్స్ వాడుతారు.
ఇంకా కనుబొమ్మలు..సాధారణంగానే ఇవి అందరికి తక్కువగా ఉంటాయి.కానీ చాలామంది అమ్మాయిలు.. వీటికి మస్కారా వాడుతారు. అందంగా కనిపించాలని..కానీ ఇంకొంతమంది అక్కడితో ఆగరు..ఆర్టీఫీషియల్ ఐలాషెస్ వాడుతారు. కానీ అవి చాలా ప్రమాదకరమని మీకు తెలుసా.కనురెప్పలకు కృత్రిమంగా వెంట్రుకలను అమర్చుతున్నారు. ఇలా చేయడం వల్ల నిజమైన వెంట్రుకలు దెబ్బతింటాయి. దీని వల్ల కళ్లకి ఎఫెక్ట్ పడుతుంది. చూపు సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. మంట, వాపు వస్తాయి..సాధారణంగా బ్రాండెడ్ మేకప్ వస్తువులను వాడటం వల్ల కళ్ళకు హాని జరగదని మహిళలు అనుకుంటారు. కానీ అది నిజం కాదు. కనుబొమ్మ వెంట్రుకలు పొడిగించడానికి వాడే జిగురులో ఫార్మాల్డిహైడ్ ఉంటుంది. ఇది ఏ కంపెనీది వాడుతున్నారనేది కాదు ఖచ్చితంగా ఇది కళ్లకి హాని చేస్తుందనేది మహిళలు గమనించాలి. కళ్ళ మంట, వాపు వంటి సమస్యలకు కారణమవుతుంది.
ఒకవేళ మీరు చాలా కాలంగా కనురెప్పలకు మేకప్ , వెంట్రుకల పొడవుకు బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటే కొన్ని రోజుల తర్వాత వాటి దుష్ప్రభావాలు అనుభవించక తప్పదంటున్నారు సౌందర్య నిపుణులు. కళ్ళు మంట, వాపు, కనురెప్పలపై చికాకును అనుభవిస్తారు. అంతేకాదు కంటి ఇన్ఫెక్షన్లకు కూడా దారి తీస్తుంది. కళ్లు పొడిబారుతాయి.అందుకే వీటికి దూరంగా ఉండటం మంచిది. మీరు ఫేస్ కి వాడే క్రీమ్స్ కానీ లిపిస్టిక్స్ కానీ దీర్ఘకాలికంగా వాడితే..దుష్ప్రభవాలు ఎదుర్కోకతప్పదు. అన్ని రకాల మేకప్ సామాన్లలో రసాయనాలు ఉంటాయి. కాబట్టి తప్పదు వాడాలనుకునేవారు..తక్కువ కెమికల్స్ ఉన్నవి ఎంచుకోవటం బెటర్..అసలు ఈ ఐ లాషెస్ వాడకపోవటం ఉత్తమం అంటున్నారు నిపుణులు. మరి ఇప్పటికైనా ఊరికే మేకప్ వేసుకోవటం తగ్గిస్తే మంచిది. సందర్భానుసారంగా మేకప్ ని లైట్ గా వేసుకుంటే మీ ఆరోగ్యానికే మంచిదంటున్నారు వైద్యనిపుణులు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..