Thursday, November 21, 2024

బిల్లు కట్టకపోతే డెడ్ బాడీలు ఇవ్వరా?

కరోనా ముసుగులో కొంతమంది వైద్యులు, మరికొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు అక్రమ దందాలకు తెరలేపుతున్నారు. కరోనా రోగులను భయపెట్టి భయభ్రాంతులకు గురిచేస్తూ రూ. లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. కరోనా కష్టకాలాన్ని కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు కాసులు సంపాదించుకునేందుకు వాడుకోవడంపై తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా ట్రీట్ మెంట్ కోసం చార్జీలు ఎక్కువగా వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఈటల చెప్పారు. బిల్లు కట్టకపోతే డెడ్ బాడీలను బంధువులకు ఇవ్వరా అని ప్రశ్నించారు. కరోనా పేషెంట్లకు ఎంత ఛార్జీ చేయాలో గతేడాది రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన జీవో ద్వారా చెప్పిందని, ఇప్పటికీ అది అమల్లోనే ఉందన్నారు. అయినా ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. ప్రైవేటు ఆసుప‌త్రులు క‌రోనా చికిత్స‌కోసం అధిక ధ‌ర‌లు వ‌సూలు చేయకూదని, ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన ధ‌ర‌కే చికిత్స‌అందించాల‌ని మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ స్ప‌ష్టం చేశారు. తెలంగాణలో ప్రస్తుతం 10 వేల బెడ్లకు ఆక్సిజన్ లైన్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement