చలికాలాన్ని కొంతమంది ఎంజాయ్ చేస్తుంటే.. ఇంకొంతమందికి ప్రాణసంకటంగా భావిస్తుంటారు. సీజనల్ వ్యాధులు ముసురుకోవడంతోపాటు ఆస్తమా, బ్రాంకైటీస్ వంటి సీవియర్ సిచ్యుయేషన్ ఉన్న వారు మరింత ఆందోళన చెందుతుంటారు. చిన్న పిల్లలు, ఓల్డ్ ఏజ్ వారికి కూడా ఈ సీజన్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే.. మధ్యాహ్నం వేడి గాలులు, సాయంత్రం నుంచి ఉదయం వరకు చలిగాలులు ఇబ్బంది పెడుతుంటే.. కాస్త జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.. ఎందుకంటే ఈ సమయంలో మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్కు గురయ్యే చాన్సెస్ ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు.
– నాగరాజు చంద్రగిరి, ఆంధ్రప్రభ
చలికాలం వచ్చింది. మధ్యాహ్నం వేళ ఎండలు దంచికొడుతుంటే, సాయంత్రం నుంచి ఉదయం వరకు చల్లటి గాలుల తీవ్రత పెరుగుతోంది. రాత్రివేళ హైదరాబాద్ సిటీతో పాటు అటవీ ప్రాంత గ్రామాల్లో టెంపరేచర్లు సాధారణ ఉష్ణోగ్రత నుంచి భారీగా పడిపోతున్నాయి. హైదరాబాద్ సిటీలో నవంబర్ చివరి వారంలో 12 నుంచి 14 డిగ్రీల టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ఇక తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా అటవీ ప్రాంతాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని లంబసింగి వంటి ప్రత్యేక వాతావరణ పరిస్థితులుండే ఏరియాల్లో రికార్డు స్థాయిలో టెంపరేచర్లు తగ్గుతున్నాయి.
అయితే.. ఈ వసంత రుతువు ప్రారంభంలో ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. చిన్న పిల్లలు, ఓల్డ్ ఏజ్ వారు త్వరగా అనారోగ్యం బారిన పడే చాన్సెస్ ఉంటాయి. అందుకని వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు డాక్టర్లు. అంతేకాకుండా వైద్య దృక్కోణం నుండి ఈ సమయంలో మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ (హార్ట్ అటాక్) వంటి సమస్యలు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
ఇది కొంతమంది ఓల్డ్ ఏజ్ వారిలో కాలానుగుణ మార్పులకు దారితీస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా చల్లని గాలి నుంచి వేడి గాలులతో కూడిన డిఫరెంట్ వెదర్ ఇష్యూస్.. త్వర త్వరగా మారే వాతావరణంతో మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్కు గురవుతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చలి కాలంలో అతి చల్లని గాలులతో ఛాతిలో బరువుగా ఉండడం, శ్వాస పీల్చడంలో ఇబ్బందిగా ఉండడం, స్క్వీజింగ్, ఛాతి బరువుగా అనిపించడం వంటి (ఆంజినా పెక్టోరిస్) ఇబ్బందులు తలెత్తుతాయని వైద్య పరిశోధనా నిపుణులు అంటున్నారు. అందులో 5 నుంచి 10 డిగ్రీల చల్లని గాలిని అకస్మాత్తుగా పీల్చినప్పుడు కరోనరీ హార్ట్ డిసీజ్ ఉన్న రోగులలో ECG తరచుగా ఆంజినా పెక్టోరిస్ మాదిరిగానే మార్పులను చూపుతుందని పలు ప్రయోగాలు నిరూపించాయంటున్నారు.
విపరీతమైన చలి, చలిగాలుల కారణంగా మయోకార్డియల్ ఆక్సిజన్ వినియోగ సూచిక పెరుగుతుందని, అందువల్ల శ్వాస పీల్చడం వేగవంతమవుతుందని డాక్టర్లు అంటున్నారు. పరిధీయ రక్త నాళాలు సంకోచిస్తాయని, ఎడమ జఠరిక లోడ్ పెరుగుతుందని చెబుతున్నారు. దీనివల్లమయోకార్డియల్ హైపోక్సియా ఏర్పడుతుంది. అదనంగా జలుబు కరోనరీ ఆర్టరీ స్పామ్‌ను కూడా ప్రేరేపిస్తుంది. మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ ఉన్న వారిలో 67% మంది జలుబుతో బాధపడుతుంటారని కొన్ని పరిశోధనలకు సంబంధించిన గణాంకాలు చూపిస్తున్నాయి.