తెలంగాణ రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ ముగిసిందని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. కరోనా మహమ్మారి మూడు వేవ్ ల రూపంలో ప్రపంచాన్ని పట్టిపీడించిందన్నారు. తెలంగాణ కరోనా పాజిటివీటి రేటు రెండు శాతం మాత్రమేనని చెప్పారు. ఫస్ట్ వేవ్ 10 నెలలు, సెకండ్ వేవ్ 6 నెలలు, థర్డ్ వేవ్ మూడు నెలలు మాత్రమే ఉందన్నారు. థర్డ్ వేవ్ ను సమర్ధవంతంగా ఎదురుకున్నామని డీహెచ్ తెలిపారు. వ్యాక్సిన్ వల్లే థర్డ్ వేవ్ ను సమర్ధవంతంగా ఎదురుకున్నామన్నారు. వచ్చే వారం రోజుల్లో 100 కేసులు మాత్రమే వస్తాయని తెలిపారు. రాష్ట్రంలో ఫీవర్ సర్వే ఇంకా కొనసాగుతోందని వెల్లడించారు. కొత్త వేరియంట్లు వచ్చినా ప్రమాదం లేదన్న డీహెచ్.. రాష్ట్రంలో ఎలాంటి ఆంక్షలు లేవు అని స్పష్టం చేశారు. కేంద్రం కూడా ఆంక్షలు ఎత్తివేసిందన్నారు.
ఐటి సంస్థలు కూడా ఫిజికల్ గా ఉద్యోగులను ఆఫీస్ లకు పిలవాలని తెలిపారు. కరోనా రానున్న రోజుల్లో సీజనల్ ఫ్లూ గా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. తెలంగాణ ప్రజలందరూ ఊపిరి పీల్చుకొనే సమయం వచ్చిందని శ్రీనివాసరావు చెప్పారు. కొత్త కొత్త వేరియంట్ గా వచ్చే అవకాశం లేకపోలేదన్నారు. మళ్ళీ ఆర్థిక స్థితిగతులను గాడిన పడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.