Sunday, November 17, 2024

శ్వేతా మ‌హంతికి ఆరోగ్య‌శాఖ బాధ్య‌త‌లు.. గ్రీటింగ్స్​ చెబుతున్న అభిమానులు

2011 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన శ్వేతా మహంతి తెలంగాణ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులుగా బాధ్యతలు స్వీకరించారు. వనపర్తి జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడే మంచి పేరు తెచ్చుకున్నారు ఆమె. ఇంజనీరింగ్‌ చేసి మంచి ఉద్యోగం సాధించి ఆత్మసంతృప్తి కలగక సివిల్స్ వైపు అడుగులు వేసి రెండో ప్రయత్నంలో ఏకంగా ఆల్‌ఇండియా రెండో ర్యాంకు సాధించి కలెక్టర్ అయ్యారు.

అయితే ఆ తర్వాత కొంతకాలం హైదరాబాద్​ కలెక్టర్​గా కూడా పనిచేసి ఇక్కడా తనదైన ముద్రవేశారు. ప్రజల నుంచి మంచి కలెక్టర్గా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వేర్వేరు చోట్ల పనిచేసినా ఇప్పుడు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులుగా శ్వేతా మహంతి బాధ్యతలు చేపట్టారు. ఇవ్వాల (శనివారం) సీఎస్ సోమేశ్ కుమార్​ని బీఆర్కేఆర్ భవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. అయితే ఆమె అభిమానులు మాత్రం గుడ్​లక్​ మేడం అంటూ శుభాకాంక్షలు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement