తెలంగాణ రాష్ట్రం మరో ఘనతను సాధించింది. నీతి ఆయోగ్ విడుదల చేసిన 4వ ఆరోగ్య సూచీ నివేదికలో తెలంగాణ జాతీయ స్థాయిలో 3వ స్థానంలో నిలిచి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నది. కాగా, కేరళ మొదటి స్థానంలో, తమిళనాడు రెండో స్థానంలో, ఆంధ్రప్రదేశ్ నాల్గవ స్థానంలో నిలిచింది. తెలంగాణ, తమిళనాడు అద్భుత పురోగతిలో ఉండి మెరుగైన వైద్య సేవల కల్పనలో ముందంజలో ఉన్నాయని వెల్లడైంది. 2018-19వ ఏడాదికి గానూ తెలంగాణ రాష్ట్రం 4వ స్థానంలో నిలువగా, 2019-20కి ఇది ఒకస్థానం ఎదుగుదలతో 4.22శాతం వృద్ధితో 3వ స్థానానికి ఎగబాకింది. ఆస్పత్రుల బలోపేతానికి, గ్రామీణ ఆరోగ్య రంగానికి, మల్టి స్పెషాలిటీ ఆస్రత్రుల నిర్మాణం, ఆస్పత్రుల్లో అధునాతన సేవల కల్పన దిశగా సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలు ఈ విజయానికి కారణమయ్యాయి.
నీతిఆయోగ్ విడుదల చేసిన స్టేట్ హెల్త్ ఇండెక్స్ 2019-20 నివేదికలో వైద్య సేవలు మెరుగుపడిన రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం తొలి స్థానంలో నిల్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా పేదలకు, సామాన్యులకు ఉచితంగా ప్రపంచస్థాయి నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందుతోందని నివేదిక పేర్కొంది. ఈ నివేదికలో జాతీయ స్థాయిలో ఆరోగ్య రంగంలో తెలంగాణ టాప్ పొజిషన్లో ఉన్నట్లుగా పేర్కొంది. వైద్య సేవల్లో, వైద్య రంగంలో పురోగమిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానం సంపాదించింది. జాతీయ హెల్త్ ఇండెక్స్ రేటింగ్లో 3వ స్థానంలో నిలిచి తెలంగాణ సత్తా చాటింది. అనేక అంశాల్లో తెలంగాణ మెరుగు పడిందని నీతి అయోగ్ వ్యాఖానించింది. మోస్ట్ ఇంప్రూవ్డ్ కేటగిరీలో తెలంగాణలో మొదటి స్థానంలో నిలిచింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital