ఓ నవజంట ఫొటో షూట్ కోసం వెళ్లి నదిలో కొట్టుకుపోయిన ఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది. సాహసోపేతమైన ‘పోస్ట్ వెడ్డింగ్’ షూట్లు, ‘సేవ్ ది డేట్’ షూట్లు క్రేజ్గా మారిపోయాయి. ఇలాంటి కార్యక్రమాల్లో కొన్నిసార్లు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. తాజాగా కోజికోడ్ సమీపంలోని కుట్టియాడికి చెందిన నవ జంట ఫొటో షూట్ చేస్తూ నది ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఈ ప్రమాదంలో వరుడు మృతి చెందగా..వధువు పరిస్థితి విషమంగా ఉంది. కడియంగడ్కు చెందిన రెజిల్, కార్తీక మార్చి 14న వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత షూట్కోసం కట్టియాడి నది వద్దకు వెళ్లారు. అక్కడ ఫొటోలు దిగుతుండగా.. ప్రమాదవశాత్తు నదీ ప్రవాహంలో చిక్కుకుపోయారు. వారి కేకలు విన్న స్థానికులు నదిలోకి దూకి ఇద్దిరినీ బయటికి తీసి ఆస్పత్రికి తరలించారు. వీరిలో రెజిల్ మరణించగా.. కార్తీక పరిస్థితి విషమంగా ఉంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement