వరంగల్ క్రైమ్, (ప్రభ న్యూస్): ఓ వివాహితను పెళ్లి చేసుకుంటానని, ప్రేమ వల విసిరాడో ఓ యువకుడు. ఒంటరిగా ఉన్న ఆ మహిళ తనకు తోడు నీడగా నిలుస్తాడనే నమ్మకంతో కనెక్ట్ అయ్యింది. ఆమెను పూర్తిగా శారీరకంగా లొంగదీసుకున్నాడు. దాంతో ఆమె గర్భం దాల్చింది. సహజీవనం కారణంగా అమ్మనయ్యే మహాద్బాగ్యం దక్కిందనే సంతోషంతో ప్రియుడిని కలిసింది. కానీ, ఆమె గర్భవతి అని తెలిసి అతను ముఖం చాటేయడం మొదలెట్టాడు. దీంతో సదరు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వరంగల్ జిల్లా హసన్ పర్తి మండలం చింతగట్టులోని సుభాశ్‌నగర్ ప్రాంతానికి ఓ యువతికి ఎనిమిదేళ్ల క్రితం హుజూరాబాద్‌కు చెందిన ఓ యువకుడితో వివాహం జరిగింది. ఏడాది క్రితమే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వ్యవహారంలో భార్యనే నిందితురాలిని చేశారు. ఈక్రమంలో సదరు యువతి ఒంటరిగా ఉంటోంది. అయితే.. అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు పెళ్లి చేసుకుంటానని మాయమాటలతో ఆ మహిళను నమ్మించాడు. శారీరక సంబంధాన్ని ఏర్పర్చుకోన్నాడు. సహా జీవనంతో ఆమె గర్భం దాల్చింది. తనను పెళ్లి చేసుకోవాలని ఆమె పట్టుబట్టుంది.
పెళ్లి చేసుకొంటానని చెప్పిన యువకుడు ఆ తర్వాత పెళ్లికి నిరాకరించాడు. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు కాకతీయ యూనివర్సిటీ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. సదరు యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిసింది. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు
పెద్దల సమక్షంలో పంచాయితీ చేసుకోవాలని సలహా ఇవ్వడం వివాహదాస్పదంగా మారింది. ఈ ఇష్యూపై స్థానికులు చర్చించు కుంటున్నారు. న్యాయం చేయాల్సిన పోలీసులు ఓ అభాగ్యురాలికి బాసటగా నిలువకుండా, మోసం చేసిన ప్రబుద్ధుడికి వత్తాసు పలకడం చర్చనీయాంశంగా మారింది.