సిద్దిపేట జిల్లా కేంద్రం మున్సిపల్ 37వ వార్డులో ఇంటిఇంటి జ్వర సర్వేలో రాష్ట్ర మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఇంటిఇంటికి వెళ్లి స్వయంగా జ్వర సర్వే చేస్తున్నారు మంత్రి హరీష్ రావు. టీకా వేసుకున్నారా…!! మాస్క్ ధరించండి.. జ్వరం, జలుబు, దగ్గు లాంటి లక్షణాలుంటే చెప్పండి …!! జాగ్రత్తగా ఉండండి.. అంటూ ప్రజలను ఆత్మీయంగా పలకరించారు.
ఏం పోశవ్వ ఏన్ని టీకాలు వేసుకున్నావ్.? అనగానే ఒకటే సారూ.. మరీ మిగతావి ఎందుకెయ్యలేదని ఆరా తీస్తే.. సూదికి భయపడతారట..అని దూరముంది.. అని తెలియగానే సూదికి భయపడతారా..? అంటూ కరోనా రాకుండా ఉండేందుకే టీకాలు అంటూ…ఆరోగ్య మంత్రి హరీశ్ రావు దగ్గరుండి మరీ టీకాలు వేయించారు. అలాగే మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికురాలు దేవవ్వతో ఎన్ని టీకాలు వేసుకున్నావ్ తల్లీ.. అంటూ మంత్రి హరీశ్ రావు ఆరా తీశారు. ఏం అమ్మా మీ ఇంట్లో అందరూ.. టీకాలు వేసుకున్నారా.. అంటూ ఇంటి గేటు దగ్గర నుంచి ఆప్యాయంగా పలకరిస్తూ.. అంబేద్కర్ నగర్ లోని గ్యాదగోని రేణుకా ఇంట్లో 60 ఏళ్లు దాటిన.. అవ్వను నువ్వు ఎన్ని డోసులు టీకా వేసుకున్నావ్ తల్లీ అని ఆరా తీయగా.. రెండని చెబితే, రెండు కాదు, మూడు టీకాలు వాడాలి కదా… అంటూ ఆరోగ్య మంత్రి హరీశ్ రావు దగ్గరుండి మరీ మూడో టీకా బూస్టర్ డోస్ వేయించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..