Friday, November 22, 2024

Live Update | వెంటాడిన మృత్యువు.. రైలు ప్రమాదం నుంచి బయటపడ్డా, బస్సు యాక్సిడెంట్​!

ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లాలో నిన్న (శుక్రవారం) జరిగిన మూడు రైళ్ల ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులను బస్సులో తరలిస్తుంటే.. ఆ బస్సు కూడా యాక్సిడెంట్​కు గురయ్యింది. ఆ క్షతగాత్రులు మరోసారి తీవ్రంగా గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన కొందరు ప్రయాణికులు మూడు రైళ్ల ప్రమాదంలో గాయపడ్డారు. వీరిని ప్రత్యేక బస్సులో బెంగాల్​కు తరలిస్తున్నారు. అయితే రైలు ప్రమాదంలో గాయపడిన వారితో వెళ్తున్న బస్సు పశ్చిమ బెంగాల్‌లోని మేదినీపూర్‌లో ఇవ్వాల (శనివారం) ప్రమాదానికి గురైంది. పికప్‌ వాహానాన్ని ఓ బస్సు ఢీకొట్టింది. దీంతో అందులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించారు. బస్సు ప్రమాదంలో మళ్లీ గాయపడిన వారిని పలు ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే.. రైళ్ల ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి గాయాలతో తమ సొంతూరుకు వెళ్తున్న ప్రయాణికులు మరోసారి బస్సు ప్రమాదంలో గాయపడటం స్థానికంగా కలకలం రేపింది. బస్సు ప్రమాదం వల్ల ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. దీంతో పోలీసులు ట్రాఫిక్​ జామ్​ కాకుండా పరిస్థితిని అప్పటికప్పుడు సరిచేశారు.

ఇక.. ఒడిశాలోని బాలాసోర్‌ సమీపంలో నిన్న సాయంత్రం లూప్ లైన్‌లో ఆగి ఉన్న గూడ్స్ రైలును శాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టింది. దాని కంపార్ట్‌ మెంట్‌లు మెయిన్‌ లైన్‌పై పడ్డాయి. అయితే కొన్ని నిమిషాల్లోనే మెయిన్‌ లైన్‌లో వచ్చిన యశ్వంత్‌పూర్‌- హౌరా ఎక్స్ ప్రెస్, ఆ పట్టాలపై పడిన కోరమాండల్ బోగీలను ఢీకొట్టి పట్టాలు తప్పింది. ఈ మొత్తం ప్రమాదంలో ఇప్పటి వరకు 288 మందికి చనిపోగా, 900 మందికి పైగా ప్రయాణికులు గాయపడినట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే మృతులు, క్షతగాత్రుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని అనధికార వర్గాల ద్వారా తెలుస్తోంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement