గుండె సంబంధింత వ్యాధులతో బాధపడుతున్న పేద పిల్లలకు మహేశ్ బాబు అండగా నిలవడం పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. హృదయ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్న చిన్నారుల కోసం మహేశ్ ఓ చారిటీ సంస్థను స్థాపించారు. మహేష్ బాబు ఫౌండేషన్ మద్దతును తాజాగా రేయిన్ బో ఆస్పత్రి నిర్వహిస్తున్న ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ కు తెలిపారు. ఇప్పటికే మహేశ్ బాబు ఫాండేషన్ ద్వారా వందల మంది చిన్నారులకు అవసరమైన వైద్యం అందించారు. తాజాగా ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ కు మద్దతుగా నిలిచి 120 మంది పేద చిన్నారులకు గుండె సంబంధిత చికిత్స అందించేందుకు పూర్తి బాధ్యతను తీసుకున్నారు. మహేశ్ బాబు తీసుకున్న నిర్ణయానికి నగరి ఎమ్మెల్యే, నటి రోజా హృదయపూర్వకంగా అభినందలు తెలిపారు. ఈ సందర్భంగా రేయిన్ బో ఆస్పత్రిలో మహేష్ బాబు మీడియాతో ఇంటరాక్ట్ అయిన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ‘చిన్నారుల గుండె చప్పుడు వింటున్న సూపర్ స్టార్ మహేశ్ బాబుకు హ్యాట్సాఫ్’ అంటూ అభినందించింది. 1991 నుంచి 2004 వరకు లీడ్ యాక్ట్రెస్ గా కొనసాగిన రోజా ప్రస్తుతం ప్రజాసేవకు సమయం వెచ్చిస్తున్నారు. మరోవైపు ఈటీవీలో ప్రసారమవుతున్న కామెడీ షో ‘జబర్దస్త్’ షోలకు జడ్జీగా ను వ్యవహరిస్తున్నాయి.
చిన్నారుల గుండె చప్పుడు వింటున్న సూపర్ స్టార్ మహేశ్ బాబుకు హ్యాట్సాఫ్ – రోజా
Advertisement
తాజా వార్తలు
Advertisement