Friday, November 22, 2024

Hathras Stampede – మూఢ న‌మ్మ‌కంతోనే మ‌ట్టిలోకి! బాబా పాద ధూళికోసం ప‌రుగులతో పరలోకానికి….

ఆ బాబా పాద ధూళి సోకితే చాలు స‌ర్వ పాపాలు హ‌రిస్తాయి.. అత‌ని చూపు త‌మ‌పై ప‌డితే చాలు రోగాలు పోతాయి. భోలే నాథ్ బాబా న‌డిచిన మ‌ట్టి త‌మ వ‌ద్ద ఉంటే చాలు సిరి స‌పంద‌లు వెళ్లివిరిస్తాయి.. మా క‌ష్టాలు క‌డ‌తేరే మార్గం ఇదొక్క‌టే అన్న న‌మ్మ‌కం వారిని ప‌రుగులు పెట్టించింది. అలా.. మ‌ట్టికోసం వెళ్లిన వారిని అడుగులే మృత్యువై కాటేసి మ‌ట్టిలోకి తొక్కేశాయి. యూపీలో జ‌రిగిన‌ తొక్కిస‌లాట‌లో ఏకంగా 121 మంది చ‌నిపోయారు. ఈ విషాద ఘ‌ట‌నతో యావ‌త్ దేశం దిగ్భ్రాంతికి గుర‌య్యింది. మూఢ విశ్వాసంతోనే ఈ దారుణం జ‌రిగింద‌ని మేథావులు అంటున్నారు. అయితే.. దేవుడిపై భ‌క్తి, విశ్వాసం ఉంటే చాల‌ని, బాబాలు, పూజారుల‌పై మూఢ న‌మ్మ‌కం వ‌ద్ద‌ని చెబుతున్నారు. కాగా, దేశ వ్యాప్తంగా ప‌లు ఆల‌యాల వ‌ద్ద చోటుచేసుకున్న మ‌హా విషాద ఘ‌ట‌న‌లను కూడా గుర్తు చేసుకుంటున్నారు. వంద‌లాది మందిని బ‌లిగొన్న ప‌లు విషాద ఘ‌ట‌న‌ల‌ను ప‌రిశీలిద్దాం..

మృత్యువై కాటేసిన అడుగులు
తొక్కిస‌లాట‌లో 121 మంది దుర్మ‌ర‌ణం
యూపీలోని హ‌థ్రాస్ ఘ‌ట‌న‌లో పెరిగిన మృతుల సంఖ్య‌
గ‌తంలోనూ ఇలాంటి ఘ‌ట‌న‌లు ఎన్నెన్నో
విషాద ఘ‌ట‌న‌ల‌ను చేసుకుంటున్న నెటిజ‌నులు
కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల నిర్ల‌క్ష్య‌మేనంటూ సుప్రీం కోర్టుకు
నిపుణుల క‌మిటీతో విచార‌ణ జ‌ర‌పాల‌న్న పిటిష‌న‌ర్‌
సీబీఐతో ఎంక్వైరీ చేయాల‌ని అల‌హాబాద్ హైకోర్టులో మ‌రో వ్యాజ్యం
ఆశ్ర‌మం వ‌దిలేసి ఎస్కేస్ అయిన భోలే బాబా
స్వామీజీ కోసం కొన‌సాగుతున్న సెర్చ్ ఆప‌రేష‌న్‌

ఉత్తర్‌ప్రదేశ్‌ హాథ్రస్​లో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 121 మంది ప్రాణాలు విడిచారు. మరో 28 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారని, మృతుల సంఖ్య మరింత పెరిగే ప్ర‌మాదం ఉంద‌ని అధికారులు భావిస్తున్నారు. భోలే బాబా సత్సంగ్‌ పేరుతో జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఉత్తర్​ప్రదేశ్​లోని వేర్వేరు జిల్లాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన తర్వాత భోలే బాబా వెళ్లిపోతుండగా భక్తులు ఆయన పాదాలను తాకటానికి పరుగెత్తారు. వేదిక సమీపంలో ఉన్న కాలువ నుంచి నీరు పొంగి పొర్లటంతో రహదారి బురదమయంగా మారింది. దీంతో భక్తులు ఒకరిపై ఒకరు జారిపడటం వల్ల తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఇంకా పెరగొచ్చని అధికారులు, డాక్ట‌ర్లు చెప్తున్నారు. కాగా, ఆధ్యాత్మిక కార్యక్రమాల సందర్భంగా తొక్కిసలాటలు జరగడం, ప్రజలు ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న‌లు గ‌తంలోనూ జ‌రిగాయి. ఇలాంటి మృత్యుఘోష ఘ‌ట‌న‌లు జ‌రిగిన మ‌హా విషాదాల తీరును ప‌రిశీలిద్దాం..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement