దేశంలో విద్వేషపూరిత ప్రసంగాల ఘటనలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రోహింటన్ నారిమన్ ఇది నేరపూరిత చర్య అని, దోషులకు కనీస శిక్షలు విధించేలా పార్లమెంట్ నిబంధనలను సవరించాలని సూచించారు. అధికార పార్టీ, ఉన్నతాధికారులు కూడా ఈ విషయంలో మౌనంగా ఉండటమే కాకుండా దాదాపుగా ఇట్లాంటివాటిని సమర్థిస్తున్నారని అన్నారు.
“దేశంలో యువత అంత చురుకుగా లేదు. – విద్యార్థులు, స్టాండ్-అప్ కమెడియన్ల లాంటి వారు.. ప్రభుత్వాన్ని విమర్శించినందుకు దేశద్రోహ చట్టాల కింద కేసులు కూడా నమోదు అయ్యాయి. మరోవైపు ద్వేషపూరిత ప్రసంగాలతో – మారణహోమానికి దారితీసేలా పిలుపునిచ్చే వ్యక్తులు సమాజంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఇట్లాంటి వారిపై కేసులు బుక్ చేయడానికి కొంతమంది అధికారులు ఇంట్రస్టు చూపడం లేదు. అని “రాజ్యాంగ అండర్ పిన్నింగ్స్ ఆఫ్ లా రూల్” అనే అంశంపై కీలకోపన్యాసంలో జస్టిస్ రోహింటన్ వ్యాఖ్యానించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసంఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..