మౌంట్ షిష్పర్ లోని షిష్పర్ గ్లేసియర్ కరిగి వరద ముంచెత్తింది.ఈ ఘటన పాకిస్థాన్ లోని గిల్గిత్ బాల్టిస్థాన్ రీజియన్ లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పాకిస్థాన్ పర్యావరణ మార్పుల మంత్రి, సెనేటర్ షెర్రీ రెహ్మాన్ తన ట్విట్టర్ లో షేర్ చేశారు. అత్యధిక ఉష్ణోగ్రతలతో పాకిస్థాన్ కు ముప్పు పొంచి ఉందని కొన్ని రోజుల క్రితమే హెచ్చరించామని ఆమె గుర్తు చేశారు. హిమనీనదం కరగడం వల్ల వరద ముంచెత్తింది, ఆ వరద ధాటికి వంతెన పిల్లర్ల కింద మట్టి అంతా కొట్టుకుపోయిందని, ఫలితంగా వంతెన కూలిందని చెప్పారు. రెండు రోజుల్లో తాత్కాలిక వంతెనను నిర్మించనున్నట్టు వెల్లడించారు. ధ్రువ ప్రాంతాలను పక్కనపెడితే.. ప్రపంచంలోనే అత్యధిక హిమనీ నదాలు పాకిస్థాన్ లోనే ఎక్కువున్నాయని చెప్పారు. దేశ ఉత్తర ప్రాంతానికి ముప్పు పొంచి ఉందన్నారు. ఈ ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల చాలా వరకు మంచు కరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి ఉద్గారాలను తగ్గించేందుకు ప్రపంచ నేతలు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఇది కొన్ని రోజుల క్రితం జరిగినా ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement