Friday, November 22, 2024

లబ్ధిదారులకు గుడ్ న్యూస్: ఏటీఎంతో రేషన్ సరుకులు

ప్రతినెలా ప్రభుత్వం ఇస్తున్న రేషన్ బియ్యం తీసుకోవడానికి లబ్ధిదారులు పడే పాట్లు అన్ని ఇన్నీ కావు. ఎండల్లో కాళ్లరిగేలా తిరగాలి. క్యూ లైన్ లో నిలబడి రేషన్ తీసుకునేందుకు లబ్ధిదారులు పడే అవస్థలు వర్ణనాతీతం. ఇకపై రేషన్ షాపుల ముందు బారులు తీరాల్సిన అవసరం ఉండదంటోంది హర్యానా రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు నగదు తీసుకునేందుకు వీలుగా బ్యాంకులు ఏటీఎంలను ఏర్పాటు చేయగా.. తాజాగా హర్యానా ప్రభుత్వం ఏటీఎంల ద్వారా రేషన్‌ సరుకులను కూడా తీసుకునే ఏర్పాటు చేపట్టింది. 

దేశంలోనే మొదటి ‘రేషన్‌ ఏటీఎం’ను గురుగ్రామ్‌లోని ఫరూక్‌నగర్‌లో ఏర్పాటు చేసింది. ఈ ఏటీఎం నుంచి 5 నుంచి 7 నిమిషాల్లో 70 కిలోల వరకు బియ్యం, గోధుమలు, చిరుధాన్యాలు విడుదలవుతాయి. ఇందులో బయోమెట్రిక్‌ వ్యవస్థ ఉంటుంది. టచ్‌ స్క్రీన్‌ ద్వారా లబ్ధిదారుడు ఆధార్‌, రేషన్‌ ఖాతా నెంబర్‌ ప్రెస్ చేయాలి. బయోమెట్రిక్‌ కన్ఫాం కాగానే.. వారికి ఎంత బియ్యం వస్తుందో లెక్కించి ఆటోమేటిక్‌గా సంచుల్లో నింపేస్తుంది. ధాన్యం ఎటిఎంలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల సమయాన్ని ఆదా చేయడం ద్వారా వారు సరైన కొలతలో రేషన్ పొందగలుగుతారని ఆ రాష్ట్ర  డిప్యూటీ సీఎం దుష్యంత్‌ చౌతాలా తెలిపారు. వీటి ఏర్పాటుతో రేషన్‌ దుకాణాల్లో తూనికలు, కొలతల అక్రమాలకు తెర పడుతుందని.. ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత వస్తుందని తెలిపారు.  

ఇది కూడా చదవండి: పుట్టింటి మీద అలిగితే పార్టీలు పెట్టరు: షర్మిల

Advertisement

తాజా వార్తలు

Advertisement