Tuesday, November 12, 2024

Covid-19: హర్యానాలో కఠిన ఆంక్షలు.. స్కూళ్లు, సినిమా థియేటర్లు బంద్

దేశంలో ఒమిక్రాన్ కేసులు కలవర పెడుతున్నాయి. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండ‌టంతో హ‌ర్యానా ప్రభుత్వం  కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. సినిమా థియేటర్లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, స్విమ్మింగ్ పూల్స్‌, పార్కులు మూసివేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది. సామాన్య ప్ర‌జ‌ల‌తో పాటుగా ప్ర‌జాప్ర‌తినిధులు క‌రోనా బారిన ప‌డుతుండ‌టంతో 5 జిల్లాల్లో ఆంక్ష‌ల‌ను క‌ఠినంగా అమ‌లు చేస్తున్నారు. గురుగ్రామ్, ఫరీదాబాద్, అంబాలా, పంచకుల, సోనిపట్‌లలో కోవిడ్ ఆంక్షలను కఠినం చేస్తూ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. జ‌న‌వ‌రి 12 వ‌ర‌కు ఆంక్ష‌లు అమ‌లులో ఉంటాయ‌ని స్ప‌ష్టం చేసింది. ఇప్ప‌టికే హ‌ర్యానాలో నైట్ క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్నారు.

అత్యవసర సేవలు మినహా ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్యాలయాలు 50% సిబ్బంది హాజరుతో పనిచేయాలని ప్రభుత్వం సూచించింది. మాల్స్, మార్కెట్లు సాయంత్రం 5 గంటల వరకు తెరవడానికి అనుమతి ఉంది. బార్లు, రెస్టారెంట్లు 50% మందికి అనుమతి ఇచ్చింది. హర్యానా ప్రభుత్వం తాజా ఆంక్షల ప్రకారం..100 కంటే ఎక్కువ మందితో జరిగే సమావేశాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. పాఠశాలలు, కళాశాలలు, పాలిటెక్నిక్‌లు, ఐటీఐలు, కోచింగ్ సంస్థలు, లైబ్రరీలు, శిక్షణా సంస్థలు (ప్రభుత్వ లేదా ప్రైవేట్) అగన్‌వాడీ కేంద్రాలు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంత్యక్రియలు, వివాహాలు, సమావేశాలు 50- 100 మంది వరకే అనుమతి ఉంటుందని తెలిపింది. ఆయా కార్యక్రమాల్లో కోవిడ్-19 నిబంధనలు, సామాజిక దూరాన్ని ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement