దళిత బంధు పథకాన్ని సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించనున్న నేపథ్ంయలో సీఎం సభ కోసం ముమ్మర ఏర్పట్లు చేస్తున్నారు. ఈ పథకం తొలుత పైలట్ ప్రాజెక్ట్ కింద హుజురాబాద్ లో అమలుకానుంది. శాలపల్లి వెళ్లి సీఎం బహిరంగ సభా ఏర్పాట్ల చేశారు. ఈ నేపథ్యంలో దళిత బంధు కార్యక్రమం ఏర్పాట్లను మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో దళితబంధుపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే మంత్రులు శాలపల్లి వెళ్లి సీఎం బహిరంగ సభా ఏర్పాట్లను పరిశీలిస్తారు.
తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకం కింద.. ఒక్కో నిరుపేద దళిత కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామమైన వాసాలమర్రిలో ప్రారంభించినప్పటికీ.. పైలట్ ప్రాజెక్టు కింద హుజూరాబాద్ నియోజకవర్గంలో దీనిని అమలు చేయనున్నారు. ఆగస్టు 16ను ముఖ్యమంత్రి కేసీఆర్ శాలపల్లి-ఇందిరానగర్ వద్ద దళితబంధును ప్రారంభించనున్నారు. ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అమలుకు కోసం రూ.500 కోట్లు విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో అనేక కార్యక్రమాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమానికి నాందిగా నిర్వహించిన ‘సింహ గర్జన’ సభ మొదలకొని, తాను ఎంతగానో అభిమానించిన ‘రైతు బీమా’ పథకం దాకా కరీంనగర్ జిల్లా నుంచే సీఎం ప్రారంభించారు. అదే విధంగా ప్రతిష్టాత్మకమైన ‘రైతుబంధు’ పథకాన్ని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కేంద్రంగానే ప్రారంభించారు. అదే ఆనవాయితీని సీఎం సెంటిమెంటును కొనసాగిస్తూ ‘తెలంగాణ దళిత బంధు’ పథకాన్ని కూడా హుజూరాబాద్ నుంచే ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్నిమండలాల్లోని దళిత కుటుంబాల వివరాల స్థితిగతులను ఇప్పటికే తెలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా నిర్ణయించిన ప్రకారమే తెలంగాణ దళిత బంధు పథకం రూ. 1200 కోట్లతో అమలవుతుందని సీఎం తెలిపారు. అయితే పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినందున అధనంగా మరో 1500 నుంచి 2000 కోట్ల రూపాయలను పైలట్ నియోజకవర్గమైన హుజూరాబాద్ లో ఖర్చు చేయనున్నట్టు ఇప్పటికే సీఎం ప్రకటించారు.
ఇది వార్త కూడా చదవండిః దళిత బంధు సభ.. టీచర్లకు జనసమీకరణ బాధ్యత!