Saturday, November 23, 2024

హర్ ఘర్ తిరంగా.. రాజకీయం కాదు.. కిషన్ రెడ్డి

హర్ ఘర్ తిరంగా అనేది రాజకీయాలకు, ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాదని…. ఇది దేశంలోని 130 కోట్ల దేశ ప్రజలకు తిరంగపై ఉన్న దేశభక్తిని చాటే విషయానికి సంబంధించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. భారత్ కు స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు పూర్తి కానున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా ఉద్యమాన్ని తీసుకొచ్చింది. అందులో భాగంగా అందరూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల్లో పాల్గొనాలని పిలుపినిచ్చింది. అందులో భాగంగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో పలువురు ప్రముఖులతో పాటు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement