Tuesday, November 19, 2024

హ్యాపీలాండ్‌.. ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్‌లాండ్‌

ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్‌లాండ్‌ నిలిచింది. విస్తారమైన అడవులు, సెలయేళ్లు, స్వచ్ఛమైన ప్రకృతి, అద్భుతంగా అందుతున్న ప్రభుత్వ సేవలు, అత్యల్ప స్థాయిలో అసమానత, నేరాలు వంటి అంశాలతో ఆ దేశం వరుసగా ఐదోసారి ఈ ఘనతను సాధించింది. ఐక్యరాజ్య సమితి అనుబంధ విభాగమైన సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ సొల్యూషన్స్‌ నెట్‌వర్క్‌ ఆధ్వర్యంలో ఇండెక్స్‌ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. సంతోషకరమైన దేశాల జాబితాలో ఫిన్‌లాండ్‌కు అగ్రస్థానం లభించింది. 5.5 కోట్ల జనాభా ఉన్న ఫిన్‌లాండ్‌ ఉత్తర ఐరోపా దేశం. కాగా సంతోషకర దేశాల జాబితాలో ఫిన్‌లాండ్‌ తరువాతి స్థానాల్లో ఉత్తర ఐరోపా దేశాలదే అగ్రస్థానం. రెండో స్థానంలో డెన్మార్క్‌, మూడో స్థానంలో ఐస్‌లాండ్‌, నాలుగో స్థానంలో స్విట్జర్లాండ్‌, ఐదోస్థానంలో నెదర్లాండ్‌ నిలిచాయి. పదేళ్లుగా సంతోషకర దేశాల జాబితాను విడుదల చేస్తున్నారు. ఆదివారంనాడు ఇంటర్నేషనల్‌ హ్యాపీనెస్‌ డే సందర్భంగా రెండురోజుల ముందు ఈ నివేదికను విడుదల చేశారు. కాగా, సెర్బియా, బల్గేరియా, రోమేనియా తమ స్థానాన్ని కాస్త మెరుగుపరుచుకున్నాయి.

అత్యంత విషాదకర పరిస్థితులున్న (ఏమాత్రం సంతోషం లేని )దేశంగా అఎn్గానిస్తాన్‌ నిలిచింది. దాని సరసన లెబనాన్‌, వెనిజులా ఉన్నాయి. ప్రపంచ సంతోషకర దేశాల జాబితా శుక్రవారం విడుదలైంది. ఈ జాబితాలో ఈసారి 146 దేశాలుండగా చిట్టచివరన అఎn్గానిస్తాన్‌, దానికన్నా ఒక్కమెట్టుపైన లెబనాన్‌ నిలిచాయి. యుద్ధపీడిత అఎn్గానిస్తాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చాక పరిస్థితులు దారుణంగా మారాయి. మానవీయ దుష్పరిణామాలు పెచ్చుమీరాయి. దాదాపు పది లక్షలమంది ఐదేళ్ల లోపు చిన్నారులు ఆకలిబాధతో సతమతమవుతున్నట్లు ఆ నివేదిక వెల్లడించింది. తాము ఎంత సంతోషంగా ఉన్నామో ప్రజలు ఎవరికివారు చెప్పిన అభిప్రాయంతోపాటు, ఆర్థిక, సామాజిక గణాంకాల ఆధారంగా సంతోషకర దేశాల జాబితాను తయారు చేస్తున్నారు. ఆయా దేశాల్లో ప్రజల ఆర్థిక స్థోమత, అవినీతి, ఆయు:ప్రమాణం, జీవన ప్రమాణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. మూడేళ్ల సగటు గణాంకాల ఆధారంగా తుది జాబితాను ప్రకటిస్తారు. సున్నానుంచి పది పాయింట్ల వరకు ఆయా దేశాల్లో పరిస్తితులను బట్టి స్కోర్‌ ఇచ్చి వాటి స్థానాన్ని నిర్ధారిస్తారు. ఎక్కువ పాయింట్లు వచ్చిన దేశాలు సంతోషకర దేశాలుగా గుర్తించారు. కాగా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగకముందు ఈ నివేదిక తయారయ్యింది.


అమెరికా పదోస్థానంలో
సంతోషకర దేశాల జాబితాలో అమెరికా, ఫ్రాన్స్‌ తమ స్థానాన్ని కాస్త మెరుగుపరుచుకున్నాయి. మూడు స్థానాలు ఎగబాకి 16వ స్థానంలో అమెరికా, 17వ స్థానంలో యునైటెడ్‌ కింగ్‌డమ్‌ నిలవగా ఫ్రాన్స్‌ 20వ స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఆ దేశం సాధించిన మెరుగైన స్థానం ఇదే. ఓట్ల ద్వారా ప్రజాభిప్రాయాన్ని తీసుకుని ఈ నివేదికను రూపొందించడం ఆనవాయితీ.

భారత్‌ 136వ స్థానంలో…
ఈ జాబితాలో భారత్‌ తన స్థానాన్ని కాస్త మెరుగుపరుచుకుంది. గత ఏడాది 150 దేశాల జాబితాలో 139వ స్థానంలో నిలిచిన భారత్‌, ఈసారి 148 దేశాల జాబితాలో 136వ స్థానంలో నిలిచింది.

ఈ ఏడాది కొత్త భావనలు
కాగా ఈసారి జీడీపీ, సామాజిక మద్దతు, వ్యక్తిగత స్వేచ్ఛ, అవినీతి, ఎంత హాయిగా జీవిస్తున్నాం వంటి అంశాలతో పాటు సోషల్‌ మీడియాలోని గణాంకాలనూ పరిగణనలోకి తీసుకున్నారు. కోవిడ్‌ మహమ్మారి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపించిన నేపథ్యంలో ప్రజాభిప్రాయాన్ని తెలుసుకున్నారు. ప్రత్యేకించి కోవిడ్‌కు ముందు ఆ తరువాత ప్రజల భావోద్వేగాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. కోవిడ్‌ మహమ్మారి ప్రభావం మొదలయ్యాక ప్రజల్లో విచారం, ఏదో జరిగిపోతోందన్న ఆందోళన పెరిగిపోయాయని 18 దేశాల్లో ప్రజలు అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement