Thursday, November 21, 2024

హ్యాపీ మదర్స్ డే మామ్ – నేను ఓ మంచి కొడుకును కాదు – రామ్ గోపాల్ వ‌ర్మ‌

ఈమ‌ధ్య‌కాలంలో ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఎమోష‌న‌ల్ అవుతున్నారు. కాగా నేడు మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా ఆయ‌న ఓ ట్వీట్ చేశారు. తనదైన శైలిలో తన మాతృమూర్తికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన పోస్ట్ పెట్టారు. తాను మంచి కొడుకును కాదంటూ వ్యాఖ్యానించారు. హ్యాపీ మదర్స్ డే మామ్. నేను ఓ మంచి కొడుకును కాదు. కానీ, ఓ తల్లిగా నువ్వు మంచితనం కన్నా ఎక్కువ అమ్మ’’ అంటూ చేతిలో గ్లాస్ పట్టుకుని తన తల్లితో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. తన తల్లిపై ఉన్న ప్రేమను చాటుతూ ఫొటో పోస్ట్ చేయడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. ‘‘మీలో ఈ యాంగిల్ కూడా ఉందా’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement